పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కోల్‌కతాలోని భవానీపూర్ నియోజక వర్గంలో ఓటరుగా ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ఇకపై ఆయన కోల్‌కతా ఓటరుగా ఉండబోతున్నారు. ఈనెల 30 వ తేదీన భవానీపూర్‌కు జరిగే ఎన్నికల్లో ఆయన తన ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నది. గతంలో బీహార్ లో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కోల్‌కతాలో ఓటరుగా నమోదు చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను కోల్‌కతా ఓటరుగా ఓటును వేయబోతున్నారని ప్రతిపక్ష బీజేపి పేర్కొన్నది. 2026 వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే ప్రశాంత్ కిషోర్ తన ఓటును కోల్‌కతాలో నమోదు చేసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసుందుకు సిద్దమవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.
Read: హామీ ఇస్తున్నాం…సర్వీసులు ప్రారంభించండి… తాలిబన్ల పిలుపు…
