కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కాలేజీల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో ఆఖరికి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఎక్కడా చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీవ్రతరం చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి.
తాజాగా ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే విద్యార్థులకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ వసతిగృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు ఐఐటీ యాజమాన్యం వెల్లడించింది.
