NTV Telugu Site icon

అనసూయ ఎక్కడుంది.. గాలిస్తున్న పోలీసులు..

పార్ట్‌టైం జాబ్‌ అంటూ ‘లవ్‌ లైఫ్‌’ పేరుతో వేలాది మంది దగ్గర నుంచి సుమారు రూ.200 కోట్లు మోసం చేసిన ఘటనలో బాధితులు రాష్ట్రవ్యాప్తంగా బయటకు వస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లోనే కాక ఇలా రాష్ట్రవ్యాప్తంగా లవ్‌లైఫ్‌ యాప్‌ బాధితులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు 18 లక్షలు కట్టినట్టు బెజవాడ సైబర్ పోలీసులకు ఓ బాధితుడు అధికారిక ఫిర్యాదు ఇచ్చాడు. టైలింజిన్‌ అనసూయ అనే మహిళ టెలీ గ్రామ్ యాప్ ద్వారా గ్రూపులు క్రియేట్‌ చేసి ఒక్కో గ్రూపులో 250 మంది వరకు యాడ్‌ చేసింది. మెడికల్‌ డివైజ్‌ల రీ చార్జీల ద్వారా పెట్టుబడులు పెడితే పెట్టిన పెట్టుబడికి మూడు నుంచి పదిరెట్ల వరకు లాభాలు పొందవచ్చని ఆఫర్‌ చేసింది. అంతేకాకుండా పండుగల పేరిట బంపర్‌ ఆఫర్‌పెట్టి లక్షల రూపాయలు కురుస్తాయంటూ ఆశ చూపింది. దీంతో మోసపోయిన జనం అనుసూయ ఆడిన ఆటలో పావులుగా మారారు. చివరికి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కి లబోదిబోమంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనసూయ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.