Site icon NTV Telugu

రోశయ్య మృతికి ప్రధాని మోడీ సంతాపం.. ఆయనతో అనుబంధం ఉంది..

సీనియర్‌ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కొణిశేటి రోశయ్య (88) కన్నుమూశారు.. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.. రోశయ్య కన్నుమూతపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.. ఇక, తమిళనాడు గవర్నర్‌గా ఆయన పనిచేసినప్పుడు నాకు అనుబంధం ఉంది.. రోశయ్య సేవలు మరువలేనివి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు నరేంద్ర మోడీ..

https://www.youtube.com/watch?v=8QmpiSGFOpU
Exit mobile version