NTV Telugu Site icon

Rozgar Mela : 71 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ

Modi

Modi

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 లక్షల ఉద్యోగాలను అందజేస్తామని కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. దాదాపు 71 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. రోజ్‌గార్ మేళా 2023లో ప్రధాని ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన మొత్తం 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు.

Also Read:Karnataka Elections: సంకీర్ణం దిశగా కర్ణాటక.. పీపుల్‌పల్స్‌ ప్రీపోల్‌ సర్వే
చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కిందకి వెళ్తుందన్నారు. దేశంలో వివిధ రంగాలు అభివృద్ది చెందుతున్నాయని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. స్టార్ట్ అప్స్, డ్రోన్ టెక్నాలజీ, క్రీడలు, స్టేడియంలు, అకాడమీలు పెరుగుతునన్నాయన్నారు. మన దేశ తయారీ దారులను ఒకప్పుడు విశ్వసించ లేదన్నారు. ఇప్పుడు విదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. సెల్ ఫోన్ తయారీ ఇక్కడే జరుగుతుందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు ఇక్కడే తయారు చేస్తున్నామని, దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని మోడీ వివరించారు.

Also Read:Siddarth Madhavan: ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉండదు
ఓడరేవుల రంగం అభివృద్ధి చెందుతోందని చెప్పిన మోడీ… ఉపాధి కల్పనకు ఆరోగ్య రంగం కూడా అత్యుత్తమ ఉదాహరణగా మారుతోందని వెల్లడించారు. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణ పెరిగి గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. 2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ఇప్పుడు 148 విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాల పెరుగుదల కారణంగా, కొత్త ఉపాధి అవకాశాలు కూడా తెరవబడ్డాయి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.