బైడెన్‌తో ప్రధాని మోడీ కీలక చర్చలు.. కొత్త శకం మొదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్‌హౌజ్‌లో సమావేశమైన బైడెన్.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే బైడెన్‌తో మాట్లాడాననీ.. భారత్ పట్ల అప్పుడే ఆయన దృక్పథం అర్ధమైందనీ చెప్పారు.
ఇక, ఈ సమావేశానికి ముందు మీడియాతో బైడెన్ మాట్లాడుతూ ఇండియా-అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి ఇండో-పసిఫిక్ అంశాల వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం విషయంలో మరోసారి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా లాంటి దేశానికి ఎప్పుడో శాశ్వత సభ్యత్వం రావాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని అందరూ ఒప్పుకుంటారు. కానీ, శాశ్వత సభ్యత్వం దక్కడానికి కావాల్సిన చొరవ మాత్రం ఎవరూ తీసుకోవడం లేదు. వీలైనంత త్వరగా భద్రతా మండలిలో సంస్కరణలకు చొరవ తీసుకోవాలని మోడీ.. బైడెన్ ను కోరినట్టు సమాచారం.. మరోవైపు.. బైడెన్ వచ్చిన తొలినాళ్లలోనే భారత్ లో అసహనం పెరిగిపోతోదంటూ అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై దుమారం రేగింది. అయితే ఆ తర్వాత బైడెన్, మోడీ ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. పరస్పర అనుమానాల నుంచి ముందడుగు పడి.. వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టేవరకూ వచ్చింది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!