NTV Telugu Site icon

Modi – Sunak : బ్రిటన్ ప్రధాని సునక్‌కి మోదీ ఫోన్.. ఆ అంశాలపైనే చర్చ

Modi Sunak

Modi Sunak

లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. భారతీయ దౌత్య సంస్థల భద్రత సమస్యపై చర్చించారు. భారతదేశ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా బలమైన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. పలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో పురోగతిపై రిషి, మోడీ చర్చించినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. గత నెలలో భారత హైకమిషన్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించి, దాడి ఆమోదయోగ్యం కాదని సునక్ మోడీకి తెలియజేసారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవని భద్రత విషయంలో బ్రిటన్ ప్రధాని హామీ ఇచ్చారని పీఎంవో తెలిపింది.
Also Read:North Korea: “సాలిడ్ ప్యూయల్” బాలిస్టిక్ మిస్సైల్ ని పరీక్షించిన నార్త్ కొరియా..

భారతదేశం-యుకె రోడ్‌మ్యాప్ 2030లో భాగంగా, వాణిజ్యం, ఆర్థిక రంగాలలో అనేక ద్వైపాక్షిక అంశాలపై పురోగతిని కూడా మోడీ , సునక్ సమీక్షించారు. పరస్పర ప్రయోజనదాయకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకోవాల్సిన నేతలు అభిప్రాయపడ్డారు.వాణిజ్యం, ఆర్థిక రంగాలలో పెరుగుతున్న సహకారంపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చల సందర్భంగా సెప్టెంబరులో ఢిల్లీలో జరిగే జి-20 సదస్సుకు హాజరుకావాల్సిందిగా సునాక్‌ను మోడీ ఆహ్వానించారు. భారతదేశంలో కొనసాగుతున్న G20 అధ్యక్ష పదవికి UK పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. అంతేకాదు భారత సంతతికి చెందిన సునక్‌కి, బైసాఖీ సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయ ప్రజలకి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:Bihu Dance: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో అస్సాం “బిహూ నృత్యం”

కాగా, గత నెలలో లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని వేర్పాటువాద ఖలిస్తానీ జెండాలను ఊపుతూ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఇది హింసాత్మకంగా మారడంతో నిరసనకారులను అరెస్టుకు చేశారు.

Show comments