Site icon NTV Telugu

పీఎఫ్‌ చందాదారులకు అలెర్ట్.. 31వ తేదీ వరకే అవకాశం

EPFO

EPFO

పీఎఫ్‌ చందాదారులకు అలెర్ట్… ఈ నెల 31వ తేదీలోపే మీరు తప్పనిసరగా ఇది చేయాల్సింది.. లేదంటే పీఎఫ్‌కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.. యూఏఎన్‌ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్‌ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని స్పష్టం చేసింది.. యాజమాన్యాలు పీఎఫ్‌ మొత్తాలను జమ చేయలేకపోవడమే కాకుండా.. పీఎఫ్‌కు సంబంధించి చందాదారులు సైతం నగదును ఉపసంహరించుకోలేరని పేర్కొంది.. సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌ కింద ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ మే 3న ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. మొదట ఈపీఎఫ్‌ కు ఆధార్‌ జత చేయడానికి జూన్‌ 1 వరకు గడువు విధించారు.. ఇప్పుడు దానిని సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు పొడిగించారు.

Exit mobile version