వరుసగా పెరుగుతూ సామాన్యుడికి మోయలేని భారంగా తయారైన పెట్రో ధరలు.. గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈ మధ్య డీజిల్ ధర ఓసారి తగ్గినా.. దాదాపు 35 రోజుల తర్వత కాస్త ఊరట కల్పిస్తూ ఇవాళ.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.. లీటర్ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించిన చమురు సంస్థలు, లీటర్ డీజిల్‌పై 18 పైసలు తగ్గించాయి… దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64గా, లీటర్ డీజిల్ ధర రూ.89.07కు తగ్గింది. ఇక, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66గా, డీజిల్ ధర రూ.96.64గా ఉంది.. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.32, డీజిల్ ధర రూ.93.66కు చేరింది. మరోవైపు కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రేట్ రూ.101.93గా. లీటర్ డీజిల్ రూ.92.13గా పలుకుతోంది.. ఇక, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69గా ఉంటే.. లీటర్ డీజిల్ ధర రూ.97.15కి తగ్గింది. మొత్తంగా రాఖీ పౌర్ణమి రోజు.. ప్రజలకు కాస్త ఊరట కలిగించే న్యూస్ వినిపించాయి దేశీయ చమురు సంస్థలు.
తగ్గిన పెట్రో ధరలు.. 35 రోజుల తర్వాత..!
