NTV Telugu Site icon

వైరల్‌: కోడిగుడ్డు పెనం మీద వేయ‌గానే… పిల్ల‌గా మారింది…

కొన్నిసార్లు చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతుంటాయి.  ల‌క్ష‌ల్లో వీక్షిస్తుంటారు.  ఇలాంటి వాటిల్లో ఈ చిన్న వీడియో కూడా ఒక‌టి.  ఓ వ్య‌క్టి టిఫెన్ దుకాణంలో ఆమ్లెట్ వేస్తున్నాడు.  ఒక గుడ్డు ప‌గ‌ల‌గొట్టి పెనం మీద వేశాడు.  మ‌రో గుడ్డు కూడా వేయాల‌ని క‌స్ట‌మ‌ర్ కోర‌డంతో రెండో గుడ్డు తీసుకొని పగ‌ల‌గొట్టి పెనం మీద వేశాడు.  అయితే, రెండు గుడ్డు ప‌గ‌ల‌గొట్టిన వెంట‌నే అందులో నుంచి కోడిపిల్ల బ‌య‌ట‌కు వ‌చ్చింది.  వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆ వ్య‌క్తి దానిని పెనం మీద నుంచి వెంట‌నే తీసేశాడు. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఈ చిన్న వీడియోను ల‌క్ష‌ల మంది వీక్షించారు.  లైక్‌లు, షేర్లు చేస్తున్నారు.  కోడిగుడ్డు కోడిపిల్ల‌గా మార‌డం విచిత్రంగా ఉంద‌ని, ఒక ప్రాణాన్ని ర‌క్షించిన అత‌ని వ్యాపారం బాగుండాల‌ని నెటిజ‌న్లు కోరుకున్నారు.  

Read: గోదావరిలో దూకిన లేడీ వాలంటీర్… కాపాడి ప్రాణాలు వదిలిన వైసీపీ కౌన్సిలర్

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి