అమరావతి రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకోవడం తాత్కాలికమే అని, మూడు రాజధానులను ఎందుకు ఏర్పాటు చేయాలని అనుకుంటునన్నామో ప్రజలకు చెప్పాల్పిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, అన్ని ప్రాంతాల అవసరాలను బిల్లులో పొందుపరుస్తామని, దానికి అనుగుణంగా మరోసారి పూర్తి సమగ్ర బిల్లును తీసుకొస్తామని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు.
Read: యూపీ ఎన్నికలు: ఎంఐఎం కీలక నిర్ణయం.. ఇరకాటంలో ఎస్పీ…
ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మంచి కోసమే అని, కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. కొన్ని సార్లు తమకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు రావొచ్చిని, దానికి దీనికి సంబంధం లేదని, మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుందని, కాని తాము అలా చేయడంలేదని, పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభముందుకు వస్తామని పేర్నినాని తెలిపారు.
