యూపీ ఎన్నిక‌లు: ఎంఐఎం కీల‌క నిర్ణ‌యం.. ఇర‌కాటంలో ఎస్పీ…

వ‌చ్చే ఏడాది దేశంలో పెద్ద రాష్ట్ర‌మైన యూపీకి ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి.  అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చూస్తోంది బీజేపీ.  దీనికోసం పావులు క‌దుపుతున్న‌ది.  ఎలాగైనా మెరుగైన స్థానాల్లో విజ‌యం సాధించి తిరిగి పున‌ర్వైభ‌వం తీసుకురావాల‌ని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి.  అటు బీఎస్పీ కూడా పావులు క‌దుపుతోంది.  అయితే, దేశంలో ముస్లీం ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న పార్టీల్లో ఒక‌టి ఎంఐఎం  ఇప్ప‌టికే దేశంలో మ‌హారాష్ట్ర‌, బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేసింది.  

Read: లైవ్‌: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రెస్ మీట్‌

కాగా, ఇప్పుడు యూపీలో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ద‌మ‌యింది.  403 స్థానాలున్న యూపీలో క‌నీసం వంద స్థానాల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్టు ఎంఐఎం ప్ర‌క‌టించింది.   ముస్లీం ఓట్ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని బ‌రిలోకి దిగుతున్న‌ది ఎంఐఎం.  ఎంఐఎం ఒంట‌రిగా పోటీ చేస్తే దాని వ‌ల‌న ఎస్పీకి భారీ దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంటుంది.  ముస్లీం, ద‌ళిత ఓట్ల‌పైనే ఎస్పీ ఆధార‌ప‌డి ఉంది.  ఎంఐఎం పోటీ చేయ‌డానికి సిద్ద‌మైతే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, ఒక‌టి రెండ్రోజుల్లో ఆ పార్టీతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ఎస్పీ నేత‌లు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles