ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. అంతేకాకుండా నేటికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు విచారణకు హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ విషయంపై అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించి 3 రాజధానుల చట్టం రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: వీరచక్ర అవార్డు అందుకున్న బాలాకోట్ దాడుల హీరో అభినందన్..
దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. రాజధాని సినిమా ఇంకా పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా రాజధాని రైతులు, టీడీపీ వేరుకాదని, టీడీపీనే రాజధాని ప్రాంత రైతులతో పాదయాత్ర చేయిస్తోందన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదని.. కేబినెట్ మీటింగ్‌లో పాల్గొనలేదని ఆయన వెల్లడించారు.
Peddireddy sensational comments on 3 capitals