వీరచక్ర అవార్డు అందుకున్న బాలాకోట్‌ దాడుల హీరో అభినందన్‌..

2019 ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక పోరాటంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినందుకు వింగ్ కమాండర్ (ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్థమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీర చక్ర అవార్డును ప్రదానం చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. అయితే పాకిస్థాన్‌ సైతం ఎంతో అత్యాధునికమైన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ను కదన రంగంలోకి దించింది.

దీంతో మిగ్‌-21 యుద్ద విమానాన్ని నడుపుతున్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌.. తన మిగ్‌-21 తో ఫైటర్‌ జెట్‌ను కూల్చి వేశాడు. ఈ క్రమంలోనే ఆక్రమిత కశ్మీర్‌లో తన మిగ్‌-21 కూలిపోయింది. అభినందన్‌ వర్థమాన్‌ కూడా ప్యారాచూట్‌తో పాకిస్థాన్‌ పరిధిలోనే పడిపోయాడు. దీంతో పాకిస్థాన్‌ ఆర్మీ అభినందన్‌ను నిర్బంధించింది. పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కినా.. అభినందన్‌ కళ్లలో బెరుకును మాత్రం పాకిస్థాన్‌ ఆర్మీ చూడలేకపోయింది.

అభినందన్‌ను సురక్షితంగా అప్పగించాలని భారత్‌ డిమాండ్‌ చేయడమేకాకుండా ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకోవడంతో అభినందన్‌ ను పాకిస్థాన్‌ ఇండియాకు బేషరతుగా అప్పగించింది. అభినందన్‌ వర్థమాన్‌ అసమాన సహసానికి వీర చక్ర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా వీర చక్ర అవార్డును అందుకున్నారు బాలాకోట్‌ దాడుల హీరో అభినందన్‌ వర్థమాన్‌..

Related Articles

Latest Articles