తెలంగాణలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణలో సంపూర్ణంగా తిరిగానని అన్నారు. తనను దెబ్బకొట్టేకొద్దీ మరింత ఎదుగుతానని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం ప్రయత్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తాను తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని అన్నారు. తెలంగాణలోని యువతకు అవకాశాలు కల్పించాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తులు అసెంబ్లీకి వెళ్తే చూడాలని ఉందని, తప్పకుండా జనసేన ఆ కలను నిజం చేసి చూపిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు, డబ్బు పదవులు అవసరం లేదని, సమాజిక మార్పు కోరుకునే వ్యక్తిని అని పవన్ తెలిపారు. ప్రజల నుంచి దండుకునే డబ్బు తనకు అవసరం లేదని, అలా చేస్తే పాపం అవుతుందని, ప్రజలు ఏమి ఇవ్వాలి అనుకున్నా వాటిని సినిమా ద్వారా సంపాదించుకుంటానని అన్నారు.
Read: లైవ్: జనసేన తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశం