Site icon NTV Telugu

షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని చెప్పిన పవన్ కల్యాణ్… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని… 2007 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌.

read also : టీఆర్ఎస్‌లోకి ఎల్. రమణ..కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ

తెలంగాణ ఉద్యమ గడ్డ అని పేర్కొన్న పవన్‌ కల్యాణ్‌… కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జనసేన తరఫున వారిని గుర్తించి మద్దతిచ్చామని చెప్పారు పవన్‌. పార్టీ నిర్మాణం చాలా కష్టమని… నేను పగటికలలు కనే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరారు పవన్. కాగా.. ఇవాళ సాయంత్రం వైఎస్‌ షర్మిల కొత్త పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

Exit mobile version