టీఆర్ఎస్‌లోకి ఎల్. రమణ..కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ

తెలంగాణ టీడీపీ చీఫ్‌ ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్‌ను రమణ కలవనున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌ రమణ పనిచేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ మరుగున పడటం, ఆ పార్టీతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఇలా పలు కారణాల వల్ల…టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు ఎల్‌. రమణ. అయితే… టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎలాంటి హామీలు వచ్చాయే తెలియాల్సి ఉంది.

read also : తెలంగాణలో ఇక మాదే అధికారం : కొండా రాఘవరెడ్డి

మాజీ మంత్రి ఈటల స్థానంలో కరీంనగర్‌ నుంచి మరో బీసీ నాయకున్ని తీసుకునే.. ప్రయత్నంలోనే ఎల్‌. రమణకు టీఆర్‌ఎస్‌ గాలం వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా తెలంగాణ టీడీపీ కన్వీనర్‌గా రమణ పనిచేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-