NTV Telugu Site icon

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఈనెల 30 వ తేదీన క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ త‌మ అభ్య‌ర్థిని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.  అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించారు.  అయితే, బీజేపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా జ‌న‌సేన పార్టీకి అవ‌కాశం వ‌చ్చింది.  అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారని అనుకుంటున్న స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయమ‌ని ఒత్తిడి వ‌చ్చింద‌ని, చ‌నిపోయిన వ్య‌క్తి స‌తీమ‌ణిని గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని,  ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని కోరుతున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు.  ఈ ఉప ఎన్నిక‌లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అనుకున్నా, ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఎన్నిక లేకుండానే ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉన్న‌ది.  మ‌రి ఏక‌గ్రీవంపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

Read: గుండె ధైర్యం ఉంటే రాజ‌కీయం చెయ్యొచ్చు…