Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు..?

జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి రెచ్చిపోయి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి, నా వ్యక్తిగత జీవితంపైనే విమర్శలు చేస్తున్నారని.. సమాధానాలు చెప్పడం వైసీపీ నాయకులకు రాదని.. వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప..’ అంటూ పవన్ వైసీపీ నాయకులపై కామెంట్స్ చేశారు.

‘వివేకా హత్య కేసుపై అడిగితే.. నా వ్యక్తిగతం గూర్చి మాట్లాడుతున్నారు. కోడి కత్తి ఘటన చేసింది ఎవరు..? ప్రతి సన్యాసితో నేను ఎందుకు తిట్టించుకోవాలి..? నా వ్యక్తిగత జీవితంపై కూడా జగన్ చాలా సార్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు..? అంటూ వ్యక్తిగత విమర్శలు చేయటం వైసీపీకి అలవాటుగా మారిందని పవన్ కామెంట్స్ చేశారు. నేను మాట్లాడలేక కాదు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. మీరు తిట్టిన కొద్దీ నేను బలపడతాను, తప్ప బలహీనపడను. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా..! ఎవర్నీ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు.. రాజకీయాల్లో కలుపుమొక్కల్ని తీసేయాలి’ అని పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version