టీ20 ప్రపంచకప్ ముగియడంతో ఈ టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ఆటగాళ్లతో కూడిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ టీమ్‌లో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. మొత్తం ఆరు జట్ల ఆటగాళ్లను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సారథిగా ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రకటించిన టీమ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లు, శ్రీలంక నుంచి ఇద్దరు ఆటగాళ్లు, న్యూజిలాండ్ నుంచి ఒక ఆటగాడు, పాకిస్థాన్‌కు చెందిన ఒక ఆటగాడు ఉన్నారు. కనీసం 12వ ఆటగాడిగానూ టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కలేదు. 12వ ఆటగాడిగా పాకిస్థాన్‌కు చెందిన షహీన్ షా అఫ్రిదిని ఐసీసీ ఎంపిక చేసింది.
ఐసీసీ మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్స్ ఆఫ్ టీ20 వరల్డ్ కప్-2021: బాబర్ ఆజమ్ (పాకిస్థాన్, కెప్టెన్), వార్నర్ (ఆస్ట్రేలియా), బట్లర్ (ఇంగ్లండ్), అసలంక (శ్రీలంక), మర్‌క్రమ్ (దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ (ఇంగ్లండ్), హసరంగ (శ్రీలంక), జంపా (ఆస్ట్రేలియా), హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా), బౌల్ట్ (న్యూజిలాండ్), నార్జ్ (దక్షిణాఫ్రికా)
Read Also: ఓ వ్యక్తిని వరించిన అదృష్టం.. బ్యాంకు ఖాతాలో రూ.కోటి డిపాజిట్.. కానీ అంతలోనే…!!
