ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశం లేకుండా విదేశాంగ శాఖా మంత్రుల సమావేశం నిర్వహించడం కుదరని పని కావడంతో ఈనెల 25 న జరగాల్సిన సదస్సును రద్దు చేశారు. ఇక ఇదిలా ఉంటె, తాలిబన్ సర్కార్ మహిళల విద్య విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అటు పాక్ సైతం వ్యతిరేకించింది. మహిళల చదువు విషయంలో తాలిబన్ల నిర్ణయం తప్పు అని వారి తీరు మార్చుకోవాలని కోరింది.
Read: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ…ప్రత్యేక ఆహ్వానితుల జీవో కొట్టివేత
