Site icon NTV Telugu

పాక్ లో 5వేల ఇండియా ట్ర‌క్కులు… అనుమ‌తి ప‌డిగాపులు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ల‌క్ష‌లాది మంది తీవ్ర‌మైన ఆహార కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.  ఈ ఇబ్బందులను గ‌మ‌నించిన అనేక దేశాలు మాన‌వ‌తా దృక్ప‌ధంతో ఆహార‌ప‌దార్ధాల‌ను స‌ర‌ఫ‌రా చేసి ఆదుకుంటున్నారు.  ఇందులో భాగంగానే ఇండియా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ముందుకు వ‌చ్చింది.  ఇండియా నుంచి పాక్ మీదుగా ఈ గోధుమ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు 5వేల ట్ర‌క్కుల‌ను వినియోగిస్తున్న‌ది.  ట్ర‌క్కుల్లో గోధుమ‌ల‌ను నింపి పాక్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు రోడ్డు మార్గం ద్వారా చేర‌వేయాలి.  

Read: వైర‌ల్‌: సింహాన్ని దూరం నుంచి చూడాల‌నుకోవ‌డంలో త‌ప్పులేదు…. ద‌గ్గ‌రి నుంచి వీడియో తీస్తే…

అయితే, పాక్‌లోకి ప్ర‌వేశించిన ట్ర‌క్కుల‌ను అధికారులు నిలిపివేశారు.   మాన‌వ‌తా దృక్ప‌ధంతో ఆహార‌ధాన్యాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ కు అంద‌జేసేందుకు తీసుకెళ్తున్నామ‌ని భార‌త్ ఇప్ప‌టికే పాక్‌కు స‌మాచారం ఇచ్చింది.  అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేదు పాక్ అధికారులు.  ఇండియా ట్ర‌క్కులు పాక్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ వెళ్లేందుకు లాజిస్టిక్ రూల్స్ ఒప్పుకుంటాయా లేదా అని ప‌రిశీస్తున్న‌ట్టు పాక్ అధికారులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం అనుమ‌తి కోసం ఇండియా లారీలు ప‌డిగాపులు కాస్తున్నాయి.  

Exit mobile version