దారుణం: 24 ఏళ్ల త‌రువాత ఆ లిఫ్ట్‌ను తెరిచి చూస్తే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుప‌త్రిని నిర్మించారు.  అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు.  అయితే, 1997 వ‌ర‌కు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కార‌ణాల వ‌ల‌న వినియోగించ‌కుండా వ‌దిలేశారు.  ఆ త‌రువాత దాని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.  అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవ‌లే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయ‌గా అందులో షాకింగ్ దృశ్యాలు క‌నిపించాయి.  లిఫ్ట్‌లో ఓ మ‌నిషికి సంబందించిన అస్తిపంజ‌రం క‌నిపిచింది.  దానిని చూసిన అధికారులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  లిప్ట్ ఆగిపోయిన స‌మ‌యంలో ఆ లిఫ్ట్‌లో ఎవ‌రైనా ఉన్నారా లేదంటే, ఎవ‌రైనా హ‌త్య‌చేసి డెడ్‌బాడీని అందులోప‌డేశారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Read: సెప్టెంబ‌ర్ 7, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు

Related Articles

Latest Articles

-Advertisement-