NTV Telugu Site icon

హుజురాబాద్ లో సంచలనంగా మారిన ఆడియో…

హుజురాబాద్ లో ఓ ఆడియో టేప్ సంచలనంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఫోన్లు చేసారు. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయిందని, యూత్ అందరినీ తమ పార్టీ లోకి గుంజాలని కమలాపూర్ మండలం మాధన్నపేటకు చెందిన యువకునితో సంభాషణ జరిపినట్టుగా చర్చ జరిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు యూత్ అందరినీ తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండటంతో హుజూరాబాద్ లో కొత్త చర్చ మొదలయ్యింది.