మయన్మార్‌లో మారణహోమం ఆగడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ పాలనను అధీనంలోకి తీసుకున్నది. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. కరోనా మహమ్మారి సమయంలో సైలెంట్‌గా ఉన్న సైన్యం మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నది. కహాయ్ రాష్ట్రంలోని మోసో గ్రామంలో సాయుధ బలగాలకు, సైన్యానికి మధ్య రడగ జరిగే సమయంలో మోసో గ్రామం నుంచి ప్రజలు శరణార్థి శిబిరాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిగాయి.
Read: వింత దొంగ: చలిమంట కోసం వాహనాలను దొంగతనం చేశాడట…
ఈ కాల్పుల్లో 30 మంది మృతిచెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. శరణార్థి శిబిరాలకు వెళ్తున్న వారికి పట్టుకొని కాల్చి చంపారని, వారి మృతదేహాలను వాహనాల్లో ఉంచి తగలబెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ మారణహోమంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
