Site icon NTV Telugu

కోవిడ్‌కు చెక్..! మార్కెట్‌లోకి టాబ్లెట్‌.. ధర రూ.63..

ప్రపంచాన్ని వివిధ రూపాల్లో ఇప్పటికే భయపెడుతూనే ఉంది కరోనా మహమ్మారి.. ఓవైపు డెల్టా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టెన్షన్ పెడుతోంది.. అయితే, కోవిడ్‌కు చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు వేస్తున్నారు.. ఇక, ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చారు.. మరోవైపు.. కరోనా చికిత్సలో అద్భుతమైన ఔషధంగా చెబుతున్న టాబ్లెట్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది.. ‘మోల్నుపిరావిర్‌’ పేరుతో టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది ప్రముఖ ఔషధ దిగ్గజ సంస్థ ఆప్టిమస్‌ ఫార్మా.

Read Also: ఓటమి ఎఫెక్ట్‌.. టెస్ట్‌ క్రికెట్‌కు స్టార్‌ ప్లేయర్‌ గుడ్‌బై

హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఈ టాబ్లెట్‌ను విడుదల చేసిన ఆ సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి.. మోల్నుపిరావిర్‌.. మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ముగించుకుని, ఇటీవలే డీసీజీఐ అనుమతికి కూడా పొందినట్టు వెల్లడించారు.. ఈ టాబ్లెట్‌ వాడితో కేవలం ఐదు రోజుల్లోనే వైరస్‌లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందని తెలిపారు.. అయితే, ఒక్క మాత్ర ధర రూ.63గా ఉండనుందన్నారు.. ఒక్కో ప్యాకెట్‌లో 5 స్ట్రిప్‌లు ఉంటాయని, వీటిలో 40 టాబ్లెట్లు ఉంటాయని.. 200 ఎంజీ డోసుతో ఈ టాబ్లెట్‌ను తయారు చేసినట్టు పేర్కొన్నారు..మాత్రను వినియోగించేవారు రోజుకు రెండు చొప్పున వేసుకోవాలని.. ఇక, పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Exit mobile version