NTV Telugu Site icon

పెట్రో మంట.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..

పెట్రోల్‌ ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. తాజాగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్‌ అయ్యారు. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు పెరిగడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.91కు చేరుకుంది.

అంతేకాకుండా డీజిల్‌ పై 36 పైసలు పెరగడంతో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 105.08కు చేరకుంది. ఇదిలా ఉంటే విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.69 గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 106.26లుగా ఉంది. అంతేకాకుండా రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు కూడా పెరగిపోతుండడంతో ప్రజలు వాపోతున్నారు.