ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సౌతాఫ్రికాలో బయటపడిని ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. ఒమిక్రాన్ ధాటికి ప్రపంచ ఆరోగ్యం పడకేసింది. యూకే, ఫ్రాన్స్‌లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో రెండు లక్షలకు పైగా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఇక యూఎస్‌లో రోజువారి కేసులు 5 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వలనే కేసులు భారీగా పెరుగుతున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రులపై ఒత్తిడి క్రమంగా పెరుగుతున్నది.
Read: అలర్ట్: కోవిడ్ ఆసుపత్రులపై దృష్టి పెట్టండి…
ఇక ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో సైతం కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం రోజుల క్రితం రోజు 10 వేల కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 32 వేలు దాటింది. కరోనాను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రపంచంలో కరోనా కట్టడికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రజల్లో సహనం నశించి రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. కరోనా కారణంగా కోట్లాది మంది తమ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. హితులను, సన్నిహితులను పోగొట్టుకొన్నారు. రెండేళ్ల నుంచి మహమ్మారి ఏదోలా తట్టుకొని నిలబడ్డ ప్రపంచానికి ఒమిక్రాన్ రూపంతో మరో శతృవు ఎదురుకావడంతో ఆందోళనలు మరింత పెరిగింది.
