NTV Telugu Site icon

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం

తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.

Read Also: బీటెక్ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు తీపికబురు

కాగా సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో వైద్య అధికార బృందం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వైరస్ కట్టడికి అధికారులు తగుచర్యలు చేపట్టారు. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని హితవు పలుకుతున్నారు. మరోవైపు తాజా కేసుతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది.