Site icon NTV Telugu

ఒమిక్రాన్ టెన్ష‌న్‌: ఢిల్లీ, ముంబైలో పెరుగుతున్న క‌రోనా కేసులు…

దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్ రోజురోజుకు పెరుగుతున్న‌ది.  ఒమిక్రాన్ కేసులు పెరిగే కొల‌ది క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  ఆరునెల‌ల త‌రువాత మ‌ర‌లా ఢిల్లీ, ముంబై లో కేసులు పెరుగుతుండ‌టంతో దేశం అప్ర‌మ‌త్తం అయింది.  శ‌నివారం రోజున ఢిల్లీలో 38శాతం కేసులు పెర‌గ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి.  ఢిల్లీలో శ‌నివారం రోజున 249 కొత్త కేసులు న‌మోద‌వ్వ‌గా, ముంబైలో 757 కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  ముంబైలో నైట్ క‌ర్ఫ్యూతో పాటు 144 సెక్ష‌న్ కూడా అమ‌లు అవుతున్న‌ది.  

Read: డిసెంబ‌ర్ 26, ఆదివారం దిన‌ఫ‌లాలు

ఇక‌, ఢిల్లీలో క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై నిషేధం అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది ప్రభుత్వం.  నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి నుంచి జ‌రిమానాల రూపంలో రూ. 1.5 కోట్లు వ‌సూలు చేసింది ప్ర‌భుత్వం.  ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారికి, వారితో కాంటాక్ట్ అయిన వారికి ఒమిక్రాన్ సోకుతుండ‌గా, ఇప్పుడు విదేశాల‌కు వెళ్ల‌ని వారికి కూడా ఒమిక్రాన్ సోకుతున్న‌ది.  కోల్‌క‌తాకు చెందిన ఓ వైద్యుడికి ఎలాంటి వివేశీ ప్ర‌యాణాలు చేయ‌కున్నా ఒమిక్రాన్ సోకింది.  దీంతో ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  అత‌నికి ఒమిక్రాన్ ఎలా సోకింది అనే అంశంపై ప్ర‌స్తుతం అధికారులు దృష్టిసారించారు. 

Exit mobile version