NTV Telugu Site icon

దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్‌… 36 కి చేరిన కేసులు…

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అందోళ‌న చెందుతున్నారు.  ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  ఒక‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, రెండో కేసు ఛండీగ‌డ్‌లోనూ న‌మోదుకాగా, మూడో కేసు క‌ర్ణాట‌క‌లో బ‌య‌ట‌ప‌డింది.  ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో రెండు కేసులు న‌మోద‌య్యాయి.  ఈరోజు న‌మోదైన మ‌రో కేసుతో క‌లిపి మొత్తం మూడు కేసులు న‌మోద‌య్యాయి.  

Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన క‌స్టమర్…

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 36 కేసులు న‌మోద‌య్యాయి.  న‌వంబ‌ర్ 14 వ తేదీన మొద‌టిసారిగా ఒమిక్రాన్ వేరియంట్‌ను క‌నుగోన్నారు.  ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికాలో వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెంద‌డం మొద‌లుపెట్టింది.  కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలో 66 దేశాల‌కు పైగా వ్యాపించింది.  సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఒమిక్రాన్‌లో  30కి పైగా మ్యూటేష‌న్లు ఉండ‌టంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వాలు విజ్ఞప్తి చేశాయి.