డెల్టా నుంచి బయటపడ్డాం అనుకునేలోగా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించడంతో ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. కట్టడి చేసేందుకు నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పూర్తిగా ఎత్తివేయాలని భారత ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది.
Read: 12 దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్… అప్రమత్తమైన ఇండియా…
అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడుతున్న దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. తరుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిషేధం అమలులో ఉండనుంది.