భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న 87 కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు ఉండగా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరింది. రాజస్థాన్‌లో 17, కర్ణాటక, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, అందరూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Read: వినియోగదారులకు షాక్: ఒక్కరోజుకే పరిమితమైన జియో నయాప్లాన్…
ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే, యూరప్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద 23 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
