Site icon NTV Telugu

2 లక్షలకు చేరువలో ఒమిక్రాన్‌ కేసులు…

కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్‌ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్‌ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్‌ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్‌ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 32,877, కెనడాలో 7,500, యూఎస్‌లో 6,331 చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

అంతేకాకుండా మరికొన్ని దేశాలు కోవిడ్‌ నిబంధనలు తీవ్ర తరం చేస్తూ అదేశాలు జారీ చేశారు. ఇంకొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే యూకే, యూఎస్‌లో అధికంగా కరోనా కేసులు రావడానికి కారణం డెల్మిక్రాన్‌ అనే సూపర్‌ స్ట్రేయిన్‌ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లలోని స్పైక్‌ ప్రోటీన్‌లు కలిస్తే డెల్మిక్రాన్‌ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగకుండా దగ్గు, తీవ్ర జ్వరం, వాసన కోల్పోవడం డెల్మిక్రాన్‌ లక్షణాలని వారు అంటున్నారు.

https://ntvtelugu.com/the-omicron-case-is-disturbing-in-ongole/
Exit mobile version