Site icon NTV Telugu

భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. కొత్తగా ఎన్నికేసులంటే..?

ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్‌ నుంచి బయటపడుతున్న భారత్‌ను ఒమిక్రాన్‌ టెన్షన్‌ పట్టిపీడిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ వ్యాపించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 39 నమోదయ్యాయి.

దీంతో దేశంలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 263కు చేరుకుంది. తెలంగాణలో కొత్తగా 14, గుజరాత్‌ 9, కేరళలో 9, రాజస్థాన్‌లో 4, హర్యానా, ఉత్తరాఖండ్‌, ఏపీలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కోవిడ్‌ నిబంధనలు తీవ్రతరం చేస్తున్నాయి. అంతేకాకుండా నేడు ప్రధాని మోడీ ఒమిక్రాన్‌ కట్టడికోసం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

https://ntvtelugu.com/whats-today-updatest-23-12-2021/
Exit mobile version