Site icon NTV Telugu

భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌ను గజగజలాడిస్తోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో కొత్తగా 127 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య దేశంలో 781కు చేరుకుంది. అయితే ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 238, కేరళలో 57, గుజరాత్‌లో 49, పుదుచ్చేరిలో కొత్తగా 2 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లతో పాటు ఇతర రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోజురోజుకు దేశరాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నేటి నుంచి ఎల్లో అలర్ట్‌ అంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. అలాగే విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు మూసివేశారు. స్ట్పోర్ట్స్‌, స్పా సెంటర్లు, స్విమింగ్‌ పూల్స్‌ కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 50 శాతం సామర్థ్యంతో మెట్రో, బస్సులకు అనుమతులు ఇచ్చారు. వివాహాలు, అంత్యక్రియల్లో 20 మందికే పరిష్మన్‌ ఉంటుందని తెలిపింది.

https://ntvtelugu.com/whats-today-updates-29-12-2021/
Exit mobile version