NTV Telugu Site icon

‘OG ‘ movie: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ నటిస్తున్నారు.. ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో తెరకెక్కించారు.. యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ జనాలకు నచ్చుతుందని చిత్రాయూనిట్ చెబుతున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు..

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ సినిమా కోసం పవన్ కు 100 కోట్ల నిర్మాత డివివి దానయ్య ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మొదటి నుంచి చివరి దాకా త్రివిక్రమ్ డీల్ చేసి సెట్ చేసారని, ఆయనకు ఇంతని అమౌంట్ ను ఇస్తున్నారని తెలుస్తోంది.. ఈ సినిమా రైట్స్ బాగా ఎక్కువ ఉండనున్నాయి. ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ కు ఓటిటి సంస్దల నుంచి, టీవి ఛానెల్స్ నుంచి పోటీ విపరీతంగా ఉందని సమాచారం.. పవన్ సినిమా కాబట్టి రైట్స్ కూడా భారీగా ఉండవచ్చునని అంచనా..

కాగా, సినిమా ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీన్ని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని టాక్..గ్యాంగ్‌స్టర్‌ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్‌ మూడు విభిన్న వేరేయేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్‌ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్‌ , మూడు డాన్‌ ఇలా మూడు విభిన్న పాత్రలతో కనిపించనున్నాడని సమాచారం.. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కు జోడీగా నటించగా, ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించునున్నారు..