NTV Telugu Site icon

షాకిచ్చిన ఆకివీడు పోస్టల్‌ బ్యాలెట్‌

ఏపీలోని నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లోని మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా అందరి దృష్టి కుప్పం మున్సిపల్‌ ఫలితాలపైనే ఉంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లలోని ఓట్లను లెక్కించి అనంతరం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు అధికారులు.

అయితే ప్రారంభంలో తూర్పుగోదావరి జిల్లా ఆకివీడు పోస్టల్‌ బ్యాలెట్‌ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆకివీడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓపెన్‌ చేసే సరికి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో అధికారులంతా అవాకయ్యారు. ఇదిలా ఉంటే మిగితా చోట్ల లెక్కింపు ప్రారంభమైంది. పలు చోట్ల గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది.