కరోనా తరువాత చదువు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఇండియా నుంచి యూకే వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో మరింత ఎక్కువ మంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు యూరప్ దేశాలు సైతం జానాభాను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కరోనా సంక్షోభంలో యూరప్ లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు యూరప్ దేశాలు వీసాలను సులభతరం చేసింది.
Read: తలుపు తట్టిన అదృష్టం…రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన కూలి…
సెప్టెంబర్ 2020 నుంచి 2021 సెప్టెంబర్ వరకు 90,669 స్టూడెంట్ వీసాలను, 53,295 స్కిల్ వర్కింగ్ వీసాలను మంజూరు చేసింది. గతేడాది కంటే అత్యధికంగా వీసాలను యూకే మంజూరు చేసింది. దీంతో పెద్ద మొత్తంలో విద్యార్థులు, ఉపాధి అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారు యూకే వెళ్లేందుకు వీసాలకు ధరఖాస్తు చేసుకున్నారు. డిమాండ్ భారీగా పెరగడంతో వీసా ప్రాసెసింగ్‌కు మరింత సమయం పడుతుందని బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లీస్ ట్వీట్ చేశారు.
