NTV Telugu Site icon

నవంబర్ 30 ఆఖరి తేదీ.. లేదంటే డబ్బులు జమకావు..!!

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ 12 అంకెల UAN నంబరును ఆధార్ కార్డుకు లింకు చేసుకున్నారా? ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. నవంబర్ 30లోగా మీ UAN నంబరును ఆధార్ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం విధించిన గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఒకవేళ మీ UAN నంబరును ఆధార్‌తో లింకు చేయకపోతే మీరు పని చేసే కంపెనీ మీ ఖాతాలో జమ చేసే మొత్తం ఆగిపోతుంది. అంతేకాకుండా మీ పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బును కూడా మీరు డ్రా చేసుకునే అవకాశం ఉండదు.

UAN నంబరును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?

తొలుత ఈపీఎఫ్‌వో వెబ్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత మీ 12 అంకెల UAN నంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం మేనేజ్ సెక్షన్‌కు వెళ్లండి. అందులో కేవైసీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ ఆప్షన్ ఎంపిక చేసుకుని మీ పేరు, ఆధార్ నంబర్ టైప్ చేయాలి. ఇప్పుడు మీ డేటా సేవ్ అవుతుంది. కేవైసీలో మీరు ఇచ్చిన సమాచారం సరైందే అయితే మీ ఆధార్ నంబర్ ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్ ఖాతాతో లింక్ అవుతుంది.

Read Also: టాలీవుడ్ హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే