Site icon NTV Telugu

కిమ్ కిల‌క నిర్ణ‌యం: నార్త్ కొరియాలో ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినం…

ఉత్త‌ర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని చేప‌ట్టి ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా పార్టీ ప్లీన‌రీ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు.  ఐదురోజుల‌పాటు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.  ఇందులో కిమ్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త రెండేళ్లుగా దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ది.  దేశాన్ని అర్థికంగా బ‌లోపేతం చేసేందుకు బ‌లంగా కృషిచేయాల‌ని పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు.  క‌రోనా కార‌ణంగా దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేశారు.  దేశంలో నిబంధ‌నల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  

Read: తెలంగాణ‌లో కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు…

అంతేకాకుండా, దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు శ‌క్తివంత‌మైన ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకుంటున్నారు.  ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని, సైనిక వ్య‌వ‌స్థ దేశ పాల‌కుల‌కు అనుగుణంగా, విధేయ‌త‌గా న‌డుచుకోవాల‌ని కిమ్ పేర్కొన్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 

Exit mobile version