కరోనా, అంతర్జాతీయ ఆంక్షలతో ఉత్తర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతున్నది. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల రక్షణ, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.
ఇక, నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కిమ్ ఆమోదించలేదు. తమ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతూనే దేశ ప్రజలకు కిమ్ కొన్ని కీలక సూచనలు చేశారు. 2025 వరకు ప్రజలు తక్కువగా ఆహారం తీసుకోవాలని, చైనాతో సరిహద్దులు ఓపెన్ కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని కిమ్ సూచించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉద్యోగాలు లేక, తినేందుకు సరైన తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు తక్కువగా తినాలని అధ్యక్షుడే స్వయంగా చెప్పడంతో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
Read: ఈ చెట్టును ముట్టుకుంటే చాలు… కొమ్మలు ఊగిపోతాయి… ఎందుకంటే…
