మలాలా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. 2012 లో పాక్‌లోని స్వాత్ లోయలో స్కూల్ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో తాలిబన్లు బస్సును అటకాయించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మలాలా తలకు గాయమైంది. వెంటనే మలాలాను పెషావర్ తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి బ్రిటన్ తరలించి వైద్యం అందించారు. గాయం నుంచి కోలుకున్న తరువాత మలాలా బాలికల చదువుకోసం పోరాటం చేస్తున్నారు.
మలాలా ఫండ్ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పాక్‌లోని బాలికల విద్యకోసం పోరాటం చేస్తున్నారు. 2009లో బీబీసీ ఉర్దూ బ్లాగ్‌లో స్వాత్ లోయలో తాలిబన్ల అకృత్యాలు, బాలికలు పడుతున్న ఇక్కట్ల పేరుతో వ్యాసం రాసింది. ఆ తరువాత న్యూయార్క్ టైమ్స్ డాక్యుమెంటరీని రూపోందించింది. దీంతో మలాలా అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి ఎంపికైంది.
Read: ఆ సామాన్యురాలి గురించే సోషల్ మీడియాలో చర్చ…!!
తాలిబన్లకు వ్యతిరేకంగా గళం విప్పిన మలాలాపై కక్ష పెంచుకున్న తాలిబన్లు అక్టోబర్ 9, 2012న స్వాత్ లోయలో బస్సుపై కాల్పులు జరిపి మలాలాను హత్యచేయాలని చూశారు. అయితే, తృటిలో తప్పించుకున్న మలాలా బ్రిటన్ చేరుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తున్నారు.
2014లో మలాలాకు 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో నివశిస్తున్న మలాలా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అస్సర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తన కొత్త జీవితం ఆనందంగా సాగాలని, మీ అశిస్సులు కావాలని చెప్పి మలాలా ట్వీట్ చేశారు.
