కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఎక్కువమంది గుమికూడవద్దని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ భయం దేశంలో మొదలవ్వడంతో అన్ని రాష్ట్రాలు ఇప్పటికు అప్రమత్తం అయ్యాయి. కరోనా తరువాత వ్యాక్సినేషన్ కొంతమేర మందగించింది. అయితే, ఒమిక్రాన్ భయంతో తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి పుంజుకుంది.
Read: ఆ పార్టీని గెలిపిస్తే నెలకు 5 వేలు ఇస్తారట…!!
ఇక తమిళనాడులోని తిరుత్తణలో ఆంక్షలు మరింత కఠినం చేశారు. సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాలి అంటే తప్పని సరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని నిబంధనలు విధించారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని సినిమా థియేటర్లలోకి అనుమతించ వద్దని జిల్లా కలెక్టర్ అల్పీ జాన్ వర్గీస్ స్పష్టం చేశారు. జిల్లాలో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు ఇంకా 20 శాతం మంది ఉన్నారని, వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
