Site icon NTV Telugu

ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ మ‌రో హెచ్చ‌రిక‌: క‌ష్టాల ఊబిలోకి 50 కోట్ల‌మంది…

ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ మ‌రో హెచ్చ‌రిక చేసింది.   క‌రోనాకు ముందు స‌మ‌యంలో ప్ర‌జ‌లు ట్రీట్మెంట్  కోసం సొంత డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు.  దీంతో దాదాపు  దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేద‌రికంలో నెట్టివేయ‌బ‌డ్డార‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ వెల్ల‌డించింది.  ప్ర‌జ‌లు వైద్య‌సేవ‌లు పొందే విష‌యంలో కోవిడ్ ప్ర‌భావం చూపుతోంద‌ని, ఫ‌లితంగా ఇత‌ర ఆరోగ్య‌స‌మ‌స్య‌ల కోసం ప్ర‌జ‌లు పెద్ద‌మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ తెలియ‌జేసింది.

Read: మాదాపూర్ ఎన్‌క‌న్వెన్ష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌… అల్లు అర్జున్ అభిమానుల‌కు గాయాలు…

హెల్త్ క‌వ‌రేజ్ విష‌యంలో ఇర‌వై ఏళ్లుగా సాధించిన ప్ర‌గ‌తి ఒక్క క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో తీవ్ర‌మైన ప్రభావం చూపే అవ‌కాశం ఉందిని డ‌బ్ల్యూహెచ్ఓ తెలియ‌జేసింది.  క‌రోనాకు ముందే వైద్యం కోసం సుమారు 50 కోట్ల మంది సోంత డ‌బ్బులు ఖ‌ర్చు చేశార‌ని, క‌రోనా స‌మ‌యంలో అది మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ తెలియ‌జేసంది.  ప్ర‌పంచంలో పేద‌రికం పెర‌గ‌డం, ఆదాయాలు త‌గ్గ‌డం ప్ర‌భుత్వాలు క‌ఠిన‌మైన ఆర్థిక ప‌రిమితుల‌ను ఎదుర్కొన‌డంతో క‌ష్టాలు మ‌రింత తీవ్ర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హెచ్చ‌రించింది. అటు వ‌ర‌ల్డ్ బ్యాంక్ సైతం ఇదేవిధ‌మైన నివేదిక‌లు అందించింది.  

Exit mobile version