‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘సాహో’ తరువాత మరింత పుంజుకుంది. అయితే, సౌత్ సూపర్ స్టార్స్ ఎందరున్నా ఈ తరం బాలీవుడ్ ప్రేక్షకులకి మన జూనియర్ రెబెల్ స్టార్ పై తిరుగులేని క్రేజ్ ఏర్పడి పోయింది. ఉత్తరాది వారికి దక్షణాది అందగాడంటే ‘బాహుబలి’ మాత్రమే. అదే సత్యాన్ని ఋజువు చేసే మరో మైలురాయిని తాజాగా ప్రభాస్ దాటేశాడు!
Read Also: ఆసక్తికరంగా ‘విజయ రాఘవన్’ ట్రైలర్
సొషల్ మీడియాలో ఫేస్బుక్ ది ప్రత్యేక స్థానం. ప్రపంచ వ్యాప్తంగా మరే సొషల్ మీడియా ప్లాట్ ఫామ్ కి లేని మాస్ పాలోయింగ్ ఎఫ్బీకి ఉంది. అయితే, ఇండియాలోనూ నంబర్ వన్ సొషల్ మీడియా జెయింట్ గా ఉన్న ఫేస్బుక్ లో టాప్ టెన్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీలు ఎవరో తెలుసా? బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. 50.7 మిలియన్ ఫాలోయర్స్ తో కండల వీరుడు ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. ఆయన తరువాత అక్షయ్ కుమార్ 48 మిలియన్ ఫాలోయర్స్ తో నిజంగానే ‘ఖిలాడీ’ అనిపించుకున్నాడు. థర్డ్ పొజీషన్ లో షారుఖ్ 42.6 మిలియన్లతో సత్తా చాటాడు. ఇక నాలుగు నుంచీ ఎనిమిది స్థానాల వరకూ వరుసగా… అమితాబ్, కపిల్ శర్మ, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగణ్ ఉన్నారు. పదో స్థానం కూడా బాలీవుడ్ హీరోకే వశమైంది. ఫేస్బుక్ లో టాప్ టెన్త్ మోస్ట్ ఫాలోడ్ సెలబ్ గా షాహిద్ కపూర్ దూసుకుపోతున్నాడు…
Read Also: దాసరి కో-డైరెక్టర్ కు చిరు సాయం!
ఫేస్బుక్ టాప్ టెన్ లో కేవలం 9వ స్థానం మాత్రం మన దక్షిణాదికి దక్కింది. అది స్వంతం చేసుకున్నది ‘బాహుబలి’ ప్రభాస్. 23 మిలియన్ల మంది అనుచరులతో ‘సాహో’ స్టార్ దండయాత్ర కొనసాగిస్తున్నాడు! ఆయన తప్ప మరో సౌత్ సూపర్ స్టార్ ఎవ్వరూ ఎఫ్బీలో టాప్ టెన్ లోకి రాలేకపోయారు. అయితే, ముందు ముందు ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ రిలీజైతే ప్రభాస్ ఫాలోయింగ్ సొషల్ మీడియాలో మరింత పెరగవచ్చు. అలాగే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘డార్లింగ్’ చేస్తోన్న దీపికా, బిగ్ బి స్టారర్ ‘ప్రాజెక్ట్ కే’ కూడా ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రిలీజైతే ప్రభాస్ కి అసలు తిరుగుండదని అంటున్నారు. చూడాలి మరి, ఫ్యూచర్లో ‘ఛత్రపతి’ రికార్డుల దండయాత్ర ఎలా సాగుతుందో…