పాక్‌లో కొత్త తరహా జ్వరం విజృంభిస్తోంది. ఈ జ్వరం సోకిన వారిలో డెంగీ తరహాలోనే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతున్నాయి. నీరసించిపోతున్నారు. తీవ్రత అధికంగా ఉండటంతో ఈ జ్వరం బారిన పడిన ప్రజలు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. డెంగీ ఫీవర్ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షల్లో డెంగీ ఫీవర్ కాదని తేలుతున్నట్టు డౌ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త జ్వరాలపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: కోళ్లు కాదు… తేళ్ల పెంపకం… ఫైర్ అవుతున్న నెటిజన్లు…
ఈ తరహా జ్వరాలు కరాచీలో ప్రభలంగా విస్తరిస్తున్నాయని, అటు రాజధాని ఇస్లామాబాద్‌లో కొత్త తరహా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు కరోనా రోగులతో నిండిపోయిన ఆసుపత్రులు ఇప్పుడు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. సరిహద్దు వివాదాలు, ఏఐటీఎఫ్ గ్రే లిస్ట్, ఉగ్రవాదుల అలజడులు, కరోనాతో అతలాకుతలమైన పాక్ కు ఇప్పుడు కొత్త తరహా జ్వరాలతో మరిన్ని చిక్కుల్లో పడిపోయింది.
