NTV Telugu Site icon

మే 22 నుంచి 26 మధ్య మరో ముప్పు… యాస్ రూపంలో… 

ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌక్టే తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి.  వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది.  టౌక్టె తుఫాను బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది.  ఈసారి తూర్పు తీరంలో ఆ ముప్పు  ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది.  తూర్పు తీరంలోని అండమాన్ కు ఉత్తరాన సముద్రంలో ఈనెల 22 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.  22 న ఏర్పడే అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.  ఈ తుఫానుకు యాస్ అనే పేరుపెట్టారు.  ఈ యాస్ తుఫాను ఈనెల 26 నుంచి 27 మధ్య  వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.