నెట్ ఫ్లిక్స్ నెట్టేస్తోంది! ఇక ‘ఆ సినిమాలు, సిరీస్ లు’ అందుబాటులో ఉండవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటి గురించే చెప్పుకుంటాం. కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొంత కంటెంట్ కూడా కనుమరుగైపోతుంటుంది. సినిమాలు, ఇతర వీడియోస్ ఆయా అగ్రిమెంట్స్ ని బట్టీ నెట్ ఫ్లిక్స్ లైబ్రెరీ నుంచీ తొలగించేస్తుంటారు!
జూలై నెల నుంచీ చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ల తాలూకూ సీజన్స్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండవు. అందుకే, అవేంటో ఓ సారి చూసేద్దాం. మీరుగానీ వాటిల్లో ఏవైనా చూడకపోయినా, చూడాలని అనుకుంటున్నా వెంటనే ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వెళ్లి డబుల్ క్లిక్ చేసేయండి! లేదండీ, సదరు సినిమాలు, ఇతర కంటెంట్ మిస్ అయిపోతారు…
బ్రిటీష్ పొలిటీషన్ మార్గరేట్ థాచర్ బయోపిక్ ‘ద ఐరన్ లేడీ’. ఈ సినిమా జూలై మొదటి వారంలోనే నెట్ ఫ్లిక్స్ నుంచీ ఎత్తేస్తున్నారు. రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్స్ గురించిన సినిమా ‘స్పాట్ లైట్’. వారు చేసిన చైల్డ్ సెక్స్ అబ్యూజ్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషనే సినిమా కథాంశం! ఇది కూడా ఇదే నెల నుంచీ నెట్ ఫ్లిక్స్ యూజర్స్ కు అందుబాటులో ఉండదు.
‘ద క్రూడ్స్’ అనే యానిమేషన్ అడ్వెంచర్ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ పక్కకు తప్పిస్తోంది. డిస్నీ మూవీ ‘ద ప్రిన్సెస్ అండ్ ద ఫ్రాగ్’ కూడా హిట్ లిస్ట్ లో ఉంది.
ఇంకా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ నుంచీ నెట్టివేయబడే టైం వచ్చేసింది. ‘మ్యాడ్ మ్యాక్స్, జాంబీల్యాండ్, ఈట్ ప్రే లవ్, ఏ క్లాక్ వర్క్ ఆరేంజ్, హూక్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, ద పాట్రియాట్’ .. ఇలా చెబుతూ పోతే బోలెడు టైటిల్స్ లెక్కకు వస్తాయి!
వెబ్ సిరీస్ ల విషయంలో కూడా పాత సరుకు వద్దనుకుంటోంది నెట్ ఫ్లిక్స్. ‘హింటర్ ల్యాండ్’ మొదటి మూడు సీజన్స్ ఇక పై అందుబాటులో ఉండవు. ‘గ్రేట్ డిజైన్స్’ షో విషయంలోనూ సీజన్ 10 అండ్ సీజన్ 15 లైబ్రెరీ నుంచీ మిస్ అవ్వనున్నాయి. ‘లవ్ సిక్’ అనే థాయ్ యంగ్ అడల్ట్ రొమాన్స్ విషయంలో కూడా… ఫస్ట్ సీజన్ జూలై నుంచీ అందుబాటులో ఉండదు.
ఓల్డ్ కంటెంట్ క్రమంగా తొలగించేస్తోన్న నెట్ ఫ్లిక్స్ కొత్త ఎంటర్టైన్మెంట్ కూడా భారీగానే సిద్ధం చేస్తోంది. జూలైతో పాటూ రాబోయే నెలల్లో అనేక సినిమాలు, సిరీస్ లు, ఇతర షోలు యాడ్ అవ్వనున్నాయి. పాతవి ఇష్టపడేవారు త్వరగా చూడటం… కొత్తవి కోరేవారు కాస్త ఓపిక పట్టడం… ఇదే ప్రస్తుతానికి మనకున్న ఛాయిస్!
Also Read
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!