NTV Telugu Site icon

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరుణుడి బీభత్సం..

ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అయితే తాజాగా అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడడంతో మరోసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షా పడుతోంది.

అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అయితే రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తీ, సత్యవేడు, నగరిలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.